
జగిత్యాల జిల్లాలో మార్చి 6 నుంచి జూన్ 12 వరకు నిర్వహించిన "ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక" కార్యక్రమం విజయవంతంగా పూర్తయిందని, ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్లలోనూ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తెలిపారు.

జగిత్యాల జిల్లాలో మార్చి 6 నుంచి జూన్ 12 వరకు నిర్వహించిన "ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక" కార్యక్రమం విజయవంతంగా పూర్తయిందని, ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్లలోనూ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలోని జర్నలిస్టులకు సంబంధించిన అక్రిడిటేషన్ కార్డుల గడువును 2026 జూలై 15 వరకు పొడిగిస్తూ తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా మీడియా వర్గాలకు ఉపశమనం కలిగించింది.

కామారెడ్డి జిల్లాలోని నేరల్ తండా సొసైటీ వద్ద యూరియా కోసం రైతులు చెప్పులతో క్యూ కట్టారు. పెద్ద సంఖ్యలో రైతులు చేరుకోవడంతో రద్దీ నెలకొంది. వ్యవసాయ శాఖ అధికారిణి మాట్లాడుతూ, స్లాట్ బుక్ చేసుకున్న రైతులకు కోటా ఉంటుందని, తొందరపడాల్సిన అవసరం లేదని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక అగ్నివీర్ ఆర్మీ ఉద్యోగాలకు తాడ్వాయి ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి ఇద్దరు పూర్వ విద్యార్థులు మధు, రవితేజ ఎంపికయ్యారు. వీరు త్వరలో శిక్షణలో చేరనున్నారు.

ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో మంగళవారం యజ్ఞ సహిత యోగా కార్యక్రమం ద్వితీయ వార్షికోత్సవాన్ని స్థానిక వైశ్య భవన్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యజ్ఞంతో పాటు యోగా సాధన ప్రాముఖ్యతను యోగా గురూజీ నాగరాజు గౌడ్ వివరించారు.

కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల జీవితాలు నాశనం చేసుకోవద్దని ప్రజలకు సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 193 మందిపై న్యాయస్థానాలు కఠిన చర్యలు తీసుకున్నాయని ఆయన తెలిపారు.