ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో మంగళవారం యజ్ఞ సహిత యోగా కార్యక్రమం ద్వితీయ వార్షికోత్సవాన్ని స్థానిక వైశ్య భవన్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యజ్ఞంతో పాటు యోగా సాధన ప్రాముఖ్యతను యోగా గురూజీ నాగరాజు గౌడ్ వివరించారు.
స్థానిక పతంజలి యోగా గురూజీ నాగరాజు గౌడ్, పెద్దలు అన్నం దయానందం ఆధ్వర్యంలో జరిగిన ఈ వార్షికోత్సవంలో, ఆర్య సమాజ్ సభ్యులు శాస్త్రోక్తంగా యజ్ఞం నిర్వహించారు. మూడదుర్గయ్య, రవీందర్, గూడ రామకృష్ణ దంపతులు యజ్ఞంలో పాల్గొన్నారు.
కార్యక్రమంలో భాగంగా, యజ్ఞంలో పాల్గొన్న దంపతులతో పాటు, పలువురు పతాంజలి సభ్యులను, ప్రముఖులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. డాక్టర్ మారుతి రావు, నరసింహారావు దంపతులు, శ్రీమతి రమాదేవి, నామ శ్రీకాంత్ అడ్వకేట్, జాడే సూర్యప్రకాష్, గోస్కే బాలకిషన్, భాస్కర్, కృష్ణంరాజు, కృష్ణ టీచర్, ఆకుల వెంకట్ లు ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
యోగా గురూజీ నాగరాజు గౌడ్ మాట్లాడుతూ, యోగా సాధన ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. వయసుతో సంబంధం లేకుండా అందరూ యోగాను అలవాటు చేసుకోవాలని ఆయన సూచించారు. యోగాతో ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులు కూడా నయం అవుతాయని ఆయన పేర్కొన్నారు.
పట్టణ ప్రజలు ప్రతిరోజూ యజ్ఞ సహిత యోగ కార్యక్రమంలో పాల్గొని, యోగా సాధన ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాలని గురూజీ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం యోగా సాధనను ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషించింది.




