మహబూబ్నగర్, 21-7-2026
మహబూబ్ నగర్ లోని పాలమూరు నది రోడ్డు, కుమ్మరి వాడి, శివాలయం రోడ్డు, చైతన్య హై స్కూల్ రోడ్డు ప్రాంతాల్లో ఆటస్థలం, సరైన సౌకర్యాలు లేని పాఠశాలలు విద్యార్థుల భద్రతకు ముప్పుగా పరిణమిస్తున్నాయి. పార్కింగ్, ఫైర్ ఇంజన్ వంటి కనీస సౌకర్యాలు కూడా లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
పాలమూరు నది రోడ్డున కుమ్మరి వాడి వెళ్లే దారిలో, కుమ్మరి వాడి నుంచి శివాలయం రోడ్డులో, చైతన్య హై స్కూల్ రోడ్డుపైన ఉన్న పాఠశాలలో ఎలాంటి ఆటస్థలం, సౌకర్యాలు లేవు. పార్కింగ్ ఆస్కారం లేకపోగా, ఫైర్ ఇంజన్ తిరిగే పరిస్థితి కూడా లేదు. పాఠశాల విడిచే సమయానికి రోడ్డుపైన వాహనాలు నిలిచిపోయి విద్యార్థులకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నప్పటికీ, తల్లిదండ్రులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగినా తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం విచారకరం. ఇప్పటికైనా ఇలాంటి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఉన్నత అధికారులను కోరుతున్నారు. పాఠశాలలు వదిలే క్రమంలో పిల్లలు రోడ్డుపైకి వస్తే ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. అయినప్పటికీ, ఇలాంటి పాఠశాలలకు అనుమతి ఎలా ఇచ్చారనేది ప్రశ్నగా మారింది. గతంలో డీ.ఈ.ఓ. డబ్బులకు అమ్ముడుపోయి ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా ఇలాంటి పాఠశాలలపై డి.ఈ.ఓ. గారు మరియు కలెక్టర్ గారు స్పందించి చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.









