హనుమకొండ, 2026-07-26
తెలంగాణఎక్స్ప్రెస్జూలై26 ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచిత సివిల్ సర్వీసెస్ కోచింగ్ కోసం నిర్వహించిన అర్హత పరీక్ష ఆదివారం విజయవంతంగా ముగిసింది. దేశ అత్యున్నత సివిల్ సర్వీసుల్లో రాణించాలనే లక్ష్యంతో ఉన్న నిరుద్యోగ యువతీయువకులు పెద్ద సంఖ్యలో ఈ పరీక్షకు హాజరయ్యారు.
తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత సివిల్ సర్వీసెస్ కోచింగ్కు సంబంధించిన అర్హత పరీక్ష ఆదివారం విజయవంతంగా జరిగింది. దేశ అత్యున్నత సివిల్ సర్వీసుల్లో రాణించాలనే లక్ష్యంతో ఉన్న నిరుద్యోగ యువతీయువకులు పెద్ద సంఖ్యలో ఈ పరీక్షకు హాజరయ్యారు.
ఈ అర్హత పరీక్ష ఆదివారం ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు హనుమకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో నిర్వహించారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జ్యోతి, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ జిల్లా అధికారి బి. నిర్మల, హైదరాబాద్ స్టడీ సర్కిల్ లైజన్ ఆఫీసర్ అప్పలస్వామి, తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ ఉమ్మడి వరంగల్ జిల్లా డైరెక్టర్ డాక్టర్ కె. జగన్ మోహన్, స్టడీ సర్కిల్ ప్రతినిధి బి. కిరణ్ పాల్గొని పరీక్ష నిర్వహణను పర్యవేక్షించారు.
ఈ పరీక్ష ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. సివిల్ సర్వీసు సాధించాలనే సంకల్పంతో ఉన్న యువత ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు.












