హైదరాబాద్లోని ఆల్ ది బెస్ట్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో వివిధ జిల్లాలకు చెందిన అత్యద్భుతమైన సేవలందిస్తున్న ఫిజియోథెరపిస్టులకు ఘనంగా సన్మానించారు. కామారెడ్డి జిల్లాకు చెందిన ఫిజియోథెరపిస్ట్ ఐ. సృజన్ రెడ్డికి ఈ పురస్కారం లభించింది.
మండలంలో ఐదు సంవత్సరాలకు పైగా దివ్యాంగుల పిల్లలకు సేవలందించిన ఫిజియోథెరపిస్ట్ ఐ. సృజన్ రెడ్డికి ఈ అవార్డు లభించడం గర్వకారణమని తెలిపారు. ఆయన 13 సంవత్సరాలుగా ఫిజియోథెరపిస్ట్ సేవలను అందిస్తున్నందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ సన్మానం ఆయన నిబద్ధతకు, సేవా దృక్పథానికి నిదర్శనంగా నిలిచింది.




