కామారెడ్డి, 27 July
భారతీయ తెలంగాణఎక్స్ప్రెస్కామారెడ్డిటౌన్జూలై26 ఎక్స్ ప్రెస్ కామారెడ్డి టౌన్ జూలై26జనతా పార్టీ కార్మిక విభాగం కామారెడ్డి జిల్లా కన్వీనర్‌గా శ్రీ నాయిని మైపాల్ యాదవ్ నియామకమయ్యారు. ఈ నియామకాన్ని కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ అందే శ్రీనివాస్ ప్రకటించారు. పార్టీ పట్ల నిబద్ధత, కార్మికుల సంక్షేమం కోసం ఆయన కృషిని గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు.
భారతీయ జనతా పార్టీ కార్మిక విభాగం కామారెడ్డి జిల్లా కన్వీనర్‌గా శ్రీ నాయిని మైపాల్ యాదవ్ ని నియమించినట్లు కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ అందే శ్రీనివాస్ తెలిపారు. పార్టీ పట్ల నిబద్ధత, సేవా దృక్పథం, కార్మికుల సంక్షేమం కోసం పనిచేసే తత్వాన్ని గుర్తించి ఆయనకు ఈ బాధ్యతలను అప్పగించినట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా నూతన జిల్లా కన్వీనర్‌గా నియామకానికి సహకరించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీ నీలం చిన్న రాజులు, కామారెడ్డి ఎమ్మెల్యే శ్రీ కాటిపల్లి వెంకటరమణ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మర్రి రాంరెడ్డి, పైడి ఎల్లారెడ్డి, అలాగే బాణాల లక్ష్మరెడ్డిలకు, తనపై నమ్మకం ఉంచి భారతీయ జనతా పార్టీ కార్మిక విభాగం కామారెడ్డి జిల్లా కన్వీనర్‌గా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.










