జహీరాబాద్ పరిధిలో మంగళవారం నిర్వహించిన స్కూల్ బస్సుల తనిఖీల్లో రవాణా అధికారులు కీలక నిబంధనలను గుర్తుచేశారు. అన్ని చెల్లుబాటు అయ్యే పత్రాలు లేని బస్సులపై కఠిన చర్యలు తప్పవని రవాణా అధికారి వెంకటయ్య స్పష్టం చేశారు.
జాతీయ రహదారి-65పై జరిగిన ఈ ప్రత్యేక తనిఖీల్లో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ఏఎంవీఐ) నరేంద్ర నాయక్, సిబ్బంది పాల్గొన్నారు. పలు స్కూల్ బస్సులను ఆపి, వాటి రిజిస్ట్రేషన్, ఫిట్నెస్, ఇన్సూరెన్స్, పర్మిట్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, వాహనాల నిర్వహణలో నిర్లక్ష్యం వహించవద్దని స్కూల్ యాజమాన్యాలకు అధికారులు సూచించారు. నిబంధనలపై అవగాహన లేనివారికి అధికారులు వివరించారు.
నిబంధనలను ఉల్లంఘించే వాహనాలపై కఠిన చర్యలు తప్పవని రవాణా అధికారి వెంకటయ్య హెచ్చరించారు. విద్యార్థుల సురక్షిత ప్రయాణానికి అందరూ సహకరించాలని ఆయన కోరారు.
ఈ తనిఖీల్లో ఏఎంవీఐ నరేందర్ నాయక్, కానిస్టేబుల్ మల్లేశం, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.




